సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు. భీమవరం కు సుమారు 12 కిమీ దూరంలో ఉండి మండలం చెరుకువాడలో కారు యాక్సిడెంట్లో సాబ్జీ కన్నుమూశారు. నేటి శుక్రవారం ఉదయం కైకలూరులో ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళనకు మద్ధతు తెలియజేసి భీమవరం వైపు మధ్యాహ్నాం సుమారు 12 గంటల సమయంలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్ధిగా ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి సాబ్జీ గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భీమవరంలో ఎంతో మందికి ఆయన సన్నిహితులు అయ్యారు. ఆయన మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోని వచ్చారు. లెఫ్ట్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాస్పటల్ వద్దకు చేరుకొన్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. ఆయన పార్ధీవ దేహాన్ని రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు నేటి మధ్యాహ్నం 2గంటలకు సందర్శించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జి తో తన అనుబంధాన్ని తెలియజేస్తూ.. ఆయన కారు ప్రమాదంలో మరణించడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
