సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ అడ్జక్షతన మంత్రి వర్గం సమావేశం అయ్యి మొత్తం 40 అంశాలపై చర్చించి తీసుకొన్న ఆమోదించిన కీలక నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు నేడు, శుక్రవారం తెలిపారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పా టుకు కేబినెట్ ఆమోదం పొందింది. దీనికోసం స్థానిక ఎమ్మెల్యే , ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విశేష కృషి చేసారు.ఇక, వృధాప్య పింఛన్స్తో పాటు పలు సామాజిక పెన్షన్స్ ను రూ. 2,750 నుంచి రూ. 3,000 పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ మరియు చికిత్స పొందే రోగులకు వారి రవాణ ఖర్చు ల కింద రూ. 300 ఇవ్వాలని కెబినెట్ నిర్ణయం తీసుకొంది. దీనితో 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ జరుగుతుంది. విశాఖలో లైట్మెట్రో రేల్ ప్రాజెక్టు డీపీఆర్కు కేబినెట్ ఆమోదం పొందింది. శ్రీకాకుళం , కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్ త్రుల్లో క్యా న్స ర్ చికిత్స ప్రత్యేక విభాగం ఏర్పా టుకు నిర్ణయం తీసుకొన్నారు. కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులతో సమానం గా డీఏ, డీఆర్ చెల్లింపు ,యాంటీ నక్సల్ ఆపరేషన్లో పనిచేసే టీమ్స్ కు 15శాతం అలవెన్స్ పెంపు 51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో బ్రాండ్ అంబాసిడర్గా అంబటి రాయుడుని నియమిస్తారు. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా పంపిణీ జరుగుతుంది. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కెబినెట్ నిర్ణయం తీసుకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *