సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చ లు మరోసారి విఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీ సిబ్బంది ఐదు రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. భీమవరంలో అయితే యూటీఎఫ్ భవనం వద్ద అంగన్వాడీ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు.. గత 5 రోజులుగా రోజుకో కొత్త తరహాలో నిరసనలు తెలుపుతున్నారు. నిన్న శుక్రవారం కళ్ళకు గంతలు కట్టుకొన్నారు. వారికీ టీడీపీ, జనసేన నేతల నుండి సంఘీభావం లభించింది. అయితే చిన్నారులు ఇబ్బంది పడకుండా.. ఏపీ సర్కార్ ఓవైపు వలంటీర్లతో అంగన్వాడీ సెంటర్లు తెరిపిస్తూనే మరోవైపు అంగన్వాడీ సిబ్బందితో చర్చలు చేస్తుంది. అయితే, నిన్న జరిగిన మూడో విడత చర్చలు కూడా ఫలించలేదు. దీంతో సమ్మె కొనసాగుతోంది. సుప్రీం కోర్టు సూచించినట్లు తమ జీతాలు పెం చాలని వారు కోరుతున్నా రు. అంగన్‌వాడీ వర్క ర్లకు 26 వేల రూపాయలు హెల్ప ర్లకు 20 వేల రూపాయలు చేయాలని ఆందోళన చేస్తున్నా రు. ప్రస్తుత పరిస్థితులలో ఇది ప్రభుత్వానికి కష్టసాధ్యమని జీతాలు పెంచేందుకు మాత్రం మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *