సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీక మాసం ఇలా ముగిసింది. ఇక చికెన్ తదితర మాంసాహార ధరలు అలా పెరగటం మొదలయింది. మరి వీటితో పోటీ పడుతూ తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్ల ధర గోదావరి జిల్లాలో రిటైల్ మార్కె ట్లో రూ.7 నుంచి రూ.7.50 ధర పలుకుతుండటంతో సామాన్యు లు వాటిని కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. జాతీయ గుడ్లు సమన్వయ కమిటీ (నెక్) చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం పౌల్ట్రీ వద్ద గుడ్డు రైతు ధర రూ.5.76కు చేరడంతో పాత రికార్డులను తిరగరాసింది. నాలుగేళ్ల కాలంలో ఇదే అత్యధిక రైతు ధర కావడం విశేషం .ఉమ్మడి గోదావరి జిల్లాలతో సుమారు 400 పౌల్ట్రీ లు ఉన్నాయి. అయితే ఇటీవల ఇబ్బడిముబ్బడిగా పెరిగిన మేత ధరలతో గుడ్డు ధర పెరిగిన ప్రయోజనం అంతంత మాత్రమేనని కోళ్ల రైతులు అంటున్నా రు. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.7కు చేరడంతో పౌల్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే వచ్చే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు కేక్ల తయారీలో అధికంగా గుడ్లు ఉపయోగించడం వల్ల వాటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *