సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లాల లో సన్నబియ్యం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. తుఫాన్ నష్టం పెద్ద ఎత్తున చూపిస్తున్నారు. నిజానికి తుపాను అలా ఆగగానే.. గత 10 రోజులు అసలు వర్షాలు కురవకపోగా ఎండ కాయడంతో పంట నష్టాలు తగ్గాయి. అయినప్పటికీ కొందరు మిల్లర్స్. బడా బియ్యం వ్యాపారులు పంట లేదని చెప్పి గత వారం, పది రోజుల్లో పాతిక కిలోల బస్తాకు రూ.200 వరకు పెంచేశారు. ప్రముఖ బ్రాండ్ల సన్న బియ్యం జనవరి నెలలో 1300 లోపు విక్రయించేవారు అది కాస్త మెల్లగామెల్లగా పెరిగి గత అక్టోబర్ చివరివారం నుండి ఈ డిసెంబర్ మొదటి వారం వరకు బస్తా రిటైల్‌లో రూ.1,450 – 1500కి విక్రయించేవారు. అవే ఇప్పుడు రూ.1,650 చొప్పున అమ్ముతున్నారు. కొందరు హోల్ సెల్ వ్యాపారులు , మిల్లర్లు ఇక్కడితో సంతృప్తి చెందడం లేదు. ఈ రేటు ఇంకా పెరుగుతుందని, పాతిక కిలోల బస్తా రూ.2 వేలు అవుతుందని ప్రజలలో ప్రచారం మొదలు పెట్టారు. ప్రభుత్వం నాలుగు నెలల క్రితం బియ్యం రేట్లు పెరిగినప్పుడు రైతుబజార్లు, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి తగ్గింపు ధరలకు అమ్మించింది. మళ్లీ ఇప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం వచ్చింది. ఇష్టం వచ్చినట్లు బియ్యం ధరలు పెంచుతున్న కొందరు మిల్లరు బడా వ్యాపారులపై విజిలెన్స్ చర్యలు తీసుకొంటే కానీ ఈ దోపిడీ ని అడ్డుకోలేము, గత పదేళ్ల కాలంలో ఒకేసారి అంటే వారం రోజుల్లో బస్తాకు రూ.200 రేటు పెరగడం ఎప్పుడు చూడలేదని రిటైల్ వ్యాపారులే విస్తుపోతున్నారు.
