సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత నాలుగున్నర ఏళ్లుగా సుమారుగా 90 కోట్లతో పట్టణంలో ప్రతి వార్డులోనూ ప్రజలకు ఉపయోగపడే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఇంకా మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ‌ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. నేడు శనివారం సాయంత్రం సుమారుగా రెండు గంటలసేపు మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తాను పట్టణంలో పర్యటించిన సమయంలో ఆయా వార్డుల ప్రజల విజ్ఞప్తి మేరకు అదనంగా మరో 25 అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు చేసి భీమవరం ఆర్డీవో, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు రాజుకు పంపగా, మూడు పనులకు వెంటనే ఆమోదం వచ్చిందని అన్నారు. మిగతా పనులకు త్వరలో ఆమోదం వస్తుందని,..అన్ని పనులను శరవేగంగా మంచి క్వాలిటీ తో పూర్తీ చేసి తీరతామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *