సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలోని నలగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నేడు సోమవారం తెల్లవారుజామున నిడమనూరు మండలం, వేంపాడు సమీపంలో లారీ, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన వారి బంధువులు 7గురు కల్సి ప్రమాద స్థలికి టాటా ఏస్ వాహనంలో వస్తుండగా..ఘటన జరిగిన స్థలానికి చాల దగ్గరకు టాటా ఏస్ వాహనం వెళ్తున్న క్రమంలో ఆ వాహనాన్ని మరో వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో 4గురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జరిగిన 2 రోడ్డు ప్రమాదాలలో మృతులు అందరు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం యాదృచ్చికం.. లేదా ఏమైనా మిస్టరీ ఉందా ?
