సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతం లో అల్పపీడన ప్రభావంతో కోస్తా ఆంధ్ర లో వర్షాలు పడుతున్నాయి. నిన్న ధప ధపాలుగా స్వల్ప జల్లులు పడినప్పటికీ నేడు సోమవారం తెల్లవారు జాము నుండి భీమవరంలో ఒక మోస్తరు భారీ వర్షం కురిసింది. ఉదయం 11 గంటల కల్లా భానుడు ప్రచండ వేడి అందుకొన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా నేటి సోమవారం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన ప్రకారం.. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తణం వచ్చే గురువారం అంటే ఈనెల 13వ తేదీనాటికి ఉత్తర బంగాళాఖాతాన్ని అనుకున్న ఉన్న పశ్చిమబెంగాల్ తీరంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణకోస్తాంధ్ర ప్రాంతాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు వారం రోజుల పాటు కురిసే అవకాశం ఉందని.. వర్షాల సమయంలో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *