సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క మరో 3 నెలలు లో ఏపీ అసెంబ్లీ తో పాటు లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటు చుస్తే వైసిపి తరపున నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచిన ఎంపీ రఘురామా కృష్ణంరాజు రాష్ట్రంలో అధికార వైసిపి పార్టీకి రెబల్ గా మారి .. తదుపరి పరిణామాలలో గెలచి ఏడాది తిరగకుండానే సుమారు 4 ఏళ్ళు గా ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అయితే ఆయన కుమారుడు మాత్రం అడపదడపా భీమవరం వచ్చి వెళుతున్నా నేపథ్యంలో .. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో ఆయన కుమారుడు భరత్ పోటీ చేస్తాడని కొంత కాలంగా ప్రచారం జరిగిన.. ఆ ప్రచారాన్ని ఎంపీ రఘురామా కృష్ణంరాజు త్రిపి కొట్టి తానే మరోసారి ఇక్కడ నుండి టీడీపీ జనసేన తో పాటు బీజేపీ పొత్తు కలిస్తే ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఇటీవల ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ రోజు భీమవరం పట్టణం శివారులోని ఎంపీ రఘురామకృష్ణ రాజు నివాసంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన కుమారుడు భరత్ పాల్గొనడం రాజకీయ వర్గాలలో ఆసక్తి లేపింది. . ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు రఘురామా .. కుటుంబ సన్నిహితులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నపటికీ అతి త్వరలో ఎంపీ రఘురామా కృష్ణంరాజు కూడా నియోజకవర్గంలో పర్యటించే ఏర్పాట్లలో ఉన్నారు.
