సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది ప్రారంభం రోజున నిన్న సోమవారం జపాన్ లో సంభవించిన వరుసగా దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో..తీవ్రత స్కేల్ ఫై 7.3 పాయింట్స్ పైగా నమోదు కావడం పశ్చిమ ప్రాంతం అస్తవ్యస్తం అయింది. పలువురు మృతి చెందగా.. అనేక వేలమంది గాయాలు పాలు అయ్యి భారీ ఆస్థి నష్టం జరిగిన ఘటనపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు, మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో ‘దేవరా’ షూటింగ్ ముగించుకొని సోమవారం రాత్రి తారక్ హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజులపాటు అక్కడ ‘దేవర’ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరించిన ప్రాంతంలో భూకంపం రావడం తన హృదయాన్ని కలచివేసిందని.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని తారక్ ట్వీట్ చేశారు.‘’జపాన్ నుంచి ఇవాళే ఇంటికి వచ్చాను. అక్కడ భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను. జపాన్ ప్రజలందరూ ధైర్యంగా ఉండండి’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవర సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. కొరటాల శివ దర్శకుడు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
