సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సంక్రాంతి పండుగ వేళలలో గుడివాడ కేసినో వ్యవహారం ఫై టీడీపీ నేతలు తీవ్ర ఆక్షేపణతో బూతుల.. మంత్రి కొడాలి ని వెంటనే జగన్ సర్కార్ తొలగించాలని డిమాండ్ నేపథ్యంలో మంత్రి కొడాలి తనదైన పరుష పదజాలంతో లోకేష్ అమెరికా లో మందుకొడుతూ దుస్తులు లేని అమ్మాయిలతో సిమ్మింగ్ ఫుల్ ఫొటోలు దిగాడని, గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 365 రోజులు పబ్బులు నడిపిన చరిత్ర ఉందని, జగన్ పబ్బులను రద్దు చేసారని .. ఈ పకోడీగాళ్లు.. తనను తప్పుపట్టడం ఏమిటని ఎదురుదాడికి దిగటం అందరికి తెలిసిందే ఈ విమర్శల సందడిలో వివాదాస్వాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్యాసినోపై ముందు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి..అంటూ విచిత్ర వాదనతో తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అందులో .. ‘కొడాలి నాని కంటే ముందు గుడివాడ క్యాసినో లైఫ్ గురించి నేను గ్రేట్ జయ మాలిని ద్వారా విన్నాను. అలాగే, సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన సినిమాలో ఆ పాటను అనుమతించారు. అందుకే, క్యాసినోపై కొడాలి నానిని ప్రశ్నించే ముందు టీడీపీ నేతలు ఎన్టీఆర్‌ను ప్రశ్నించాలి’ అంటూ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ట్వీట్‌కు ‘యమగోల’ సినిమాలోని ‘గుడివాడ వెళ్లాను’ అనే వీడియో సాంగ్‌ను జత చేయడం ఆసక్తికరమైన విషయం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *