సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల వైసిపి లో చేరిన కొన్ని రోజులకే గుంటూరు ఎంపీ టికెట్ కేటాయించలేదని అలిగి పార్టీకి దూరమైనట్లు భావిస్తున్న టీమిండియా మాజీ క్రికెట్ అంబటి తిరుపతి రాయుడు పరోక్షంగా ఆ అనుమానాలను నివృతి చేస్తూ.. తాజగా నేడు, ఆదివారం తాను మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లు ప్రకటించాడు. వృ త్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్ లో ట్వీట్ చేసిన అంబటి రాయుడు.. త్వరలో దుబాయ్ లో జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ఆడనున్నట్లు ఎక్స్ లో ట్వీట్ చేసిన అంబటి రాయుడు.. ప్రకటించారు. ఇంటర్నేషనల్ లీగ్లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్లోనూ ముంబై ఇండియన్స్ కు ఆడాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *