సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ :క్షీర సాగర మధనం జరిగేటప్పుడు ముందు విషం వచ్చిందని తరువాత అమృతం వచ్చిందని మన పోరాటంలో కూడా విషం లాంటి యస్మా చట్టంను ఎదుర్కొని విజయంతో అమ్రృతంను అస్వాదిస్తామని భీమవరంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్ అన్నారు. అంగన్వాడీల సమ్మెలో భాగంగా 27వ రోజు సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించడం కోసం తీసుకొచ్చిన జీవోను ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల పోరాటానికి భయపడి ప్రభుత్వం మనకు సంబంధం లేని చట్టాన్ని మన మీద రుద్దుతూ నిర్బంధాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తుందని దీనివల్ల మన పోరాటం పట్ల ప్రభుత్వానికి ఉన్న భయం తేటతెలమవుతుందన్నారు. సంవత్సరాల తరబడి వేతనాలను పెంచుతారని ఎదురు చూస్తున్న అంగన్ వాడిలు ఆకలిమంటల తో పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నా రన్నారు. అంగన్వాడీల నిరాహారదీక్ష శిబిరం నకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి. వచ్చి సంఘీభావం తెలియచేశారు..అంగన్వాడీల సమ్మెకు ప్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్ కార్మికులు పెద్ద ఎత్తున కదిలి వచ్చి సంఘీభావం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వాసుదేవరావు, ఎం ఆంజనేయులు, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డి కళ్యాణి, తులసి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *