సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో తెలుగు దేశం ఎంపీ కేశినేని నాని ఇప్పటికే తన పార్టీ కార్యాలయం ఫై టీడీపీ జెండా తీసేసి.. ఢిల్లీ వెళ్లి తన ఎంపీ పదవికి రాజీనామా లేఖ స్పీకర్ ఇస్తానని, తదుపరి టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ సారి నాని తమ్ముడికి టీడీపీ ఎంపీ టికెట్ ఖాయం అయిన నేపథ్యంలో చంద్రబాబు తన రాజకీయం కోసం తన కుటుంబాన్ని చీల్చేశారని, టీడీపీ పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు, లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఎటువంటి ఇబ్బందులు సృష్టించలేదని తివ్ర వ్యాఖ్యలు చేసారు. దీనితో ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని నాని వర్గం టీడీపీ నేతలు అందరు రాజీనామాలకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా నేడు, సోమవారం కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత విజయవాడలో తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు. తదుపరి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమకు టీడీపీ లో గౌరవం ఇవ్వలేదని అటువంటి చోట పనిచెయ్యలేమని తిరువూరు సభకు నాని కి సంబంధం ఏమిటి? అని నారా లోకేష్ అన్నారు. నాన్నగారు ఎంపీ కాబ్బటి ఆ ప్రాంతం కూడా ఆయన నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని లోకేష్ కి తెలియక పోవడం దారుణం అని పంచ్ వేశారు.
