సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం ఉదయం స్థానిక 37వ వార్డులో కొత్తగా నిర్మించిన 3 సిసి రోడ్లను ప్రారంభించారు. ముందుగా 23 లక్షల రూపాయలతో అయ్యగారి వీధి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క నుండి జేపీ రోడ్డు వరకు నిర్మాణం చేసిన సీసీ రోడ్ ను ప్రారంభించారు. తదుపరి 32 లక్షల 60 వేల రూపాయలతో టౌన్ రైల్వే స్టేషన్ వద్ద చెక్క వారి వీధిలో నిర్మించిన సిసి రోడ్ సిసి డ్రైన్ ప్రారంభించారు. తదుపరి 17 లక్షల 50 వేల రూప్రభుత్వ నిధులతో గోవర్ధన్ టాకీస్ రోడ్డు రాఘవేంద్ర కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు నిర్మాణం చేసిన ఆర్సీసీ స్లాబ్ కల్వర్ట మరియు సిసి రోడ్ సిసి డ్రైన్ ను ప్రారంభం చేసారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇప్పటికే భీమవరం పట్టణం మొత్తం మీద సుమారు 100 కోట్ల నిధులతో రోడ్డులు , డ్రైన్స్ తదితర అభివృద్ధి నిర్మాణాలు పూర్తీ చేశామని ఇంకా ఇటీవల సీఎం జగన్ భీమవరం వచ్చిన నేపథ్యంలో మరిన్ని ప్రతిపాదనలు కు ఆయన కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తున్నారని అన్ని వార్డుల్లో సంబంధిత పనులు అతి త్వరలో అధికారుల సహకారం తో పూర్తీ చేయిస్తానని ప్రకటించారు.
