సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం రీయూనియన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13 వ తేదీలలో డిఎన్ఆర్ కాలేజీ యందు గల గన్నాబత్తుల వారి క్రీడా మైదానంలో ప్రముఖ సీనియర్ జట్లు మధ్య టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ టోర్నమెంట్లో భీమవరం కు చెందిన జాతీయ క్రీడాకారులు, మాజీ రంజీ క్రీడాకారులు మంగేష్ , రెహమాన్ , రామకృష్ణ సీనియర్ క్రికెట్ క్రీడాకారులు వేణు (బెంగళూర్) రాధాకృష్ణ (విశాఖపట్నం) ఫణి శర్మ(హైద్రాబాద్) సత్యనారాయణ(ఏలూరు) మనేపల్లి సూర్యమాణిక్యం(హైదరాబాద్)నూకల శ్రీను (అడిషనల్ SP) చినపారప్పుడి కుమార్ తదితరులు పాల్గొంటున్నారు.ప్రతి ఏటా సంక్రాంతి పురస్కరించుకుని క్రీడా మైదానంలో పట్టణ యువతకు వ్యసనాలు బారిన పడకుండా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సందేశంతో గతంలో క్రికెట్లో రాణించిన సీనియర్లు పాల్గొంటున్నారని నిర్వాహకులు గ్రంధి చల్లారావు, దండు శ్రీను (DS) తెలిపారు. కావున ఆబాలగోపాలం ఈ క్రీడల్ని తిలకించి ఆహ్లాదం పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.
