సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలకు 3 నెలలు ముందే అధికార వైసిపి లో వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వని నేతలు, ప్రస్తుత ప్రజా ప్రతినిధుల పేర్లు సీఎం జగన్ నాన్చకుండా ముందే చెప్పెయ్యడంతో వారు మరో మార్గం వెతుకొనే పక్రియలో భాగంగా టీడీపీ కన్నా జనసేన ను ఎన్నుకొంటున్నారని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. (టీడీపీ ఎంపీ కేశినేని కూడా ఇదే తరహాలో తనకు టికెట్ రాదని తేలటంతో వైసీపీ గూటికి చేరారు.) అయితే వైసిపి నుండి బయటకు వచ్చేవారు ఎక్కువ మంది వారికీ టీడీపీ కన్నా జనసేన అయితే బైపాస్ గా భావిస్తున్నారు. తాజగా..నేడు, శనివారం మచిలీపట్టణం వైసిపి ఎంపీ బాలసౌరి కూడా తనకు టికెట్ ఇవ్వనని చెప్పిన వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి జనసేన వైపు చుస్తున్నారు . ఇదిలా ఉండగా, తాజగా..నేడు, శనివారం మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తాజాగా పాలకొల్లు లో తన నివాసంలో మాట్లాడుతూ.. పవన్‌తో ఇటీవల మంగళగిరి జనసేన కార్యాలయంలో రెండు గంటలపాటు చర్చించానని తెలిపారు. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ ని కూడా చేర్చుకోవాలని పవన్ కు సూచించానని అన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి పది వేలకు పైగా ఓట్లు సాధించిన 60 సీట్లను మళ్లీ జనసేనకే కేటాయించాలని కోరారు. కనీసం 40 సీట్లు అయినా టీడీపీ జనసేనకు కేటాయించాలని ..వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు గెలిస్తే రెండేళ్లు పవన్‌కు ముఖ్యమంత్రి స్థానం కల్పించాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయని, ఇది నెరవేరవలసిందేనని హరిరామ జోగయ్య వ్యాఖ్యానించారు.
