సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు సుమారు నాలుగేళ్ల అనంతరం నేడు, శనివారం నాడు తన నివాసం ఉన్న భీమవరానికి తన అభిమానులు టీడీపీ, జనసేన నేతల ఘన స్వాగతాలు మధ్య నేటి సాయంత్రం 5న్నర గంటలకు చేరుకొన్నారు. ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు నేటి ఉదయం 10న్నర కు చేరుకొన్నారు. అక్కడ ఆయనకు ఎయిర్‌పోర్టులో అభిమానులు భారీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ కార్ల కాన్వాయ్ తో టీడీపీ జనసేన క్యాడర్ కు అభివాదం చేసుకొంటూ .. వారు కేన్లతో ఏర్పాటు చేసిన గజమాలలకు కృతజ్ఞతలు తెలుపుతూ .. రావులపాలెం, సిద్ధాంతం, మార్టేరు ,పాలకొల్లు వీరవాసరం మీదుగా అభిమానులకు అభివాదాలు చేస్తూ భీమవరానికి చేరుకున్నారు. జేపీ రోడ్డు లోకి చేరుకోగానే భారీ ప్లెక్సీ లతో రఘురామపై అడుగడుగునా అభిమానులు పూలవర్షం కురిపించారు. భారీ గజమాలతో సత్కరించారు. ఆయన రాక నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా రఘురామ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం రఘురామ మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు ఎన్నో అడ్డంకులను అధిగమించి భీమవరం రావడం చాలా ఆనందంగా ఉంది. నాలుగేళ్ల అనంతరం ఇక్కడికి వచ్చాను. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు ఎంతగానో సహకరించారు. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు.. ఈ విషయం నన్ను ఎంతగానో బాధించింది’’ అని ఎంపీ రఘురామ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తాను టీడీపీ – జనసేన పార్టీల తరపునే పోటీకి సిద్ధంగా ఉన్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. 4 రోజుల పాటు సంక్రాంతి పండుగ వేళల్లో ఎంపీ రఘురామా స్థానిక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు.
