సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పోలీస్ నిషేధ ఆజ్ఞలు , పలువురిపై బైండోవర్ కేసులు పెట్టి, నిర్వాహకులపై ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ, బరులు నిర్మిస్తున్న ప్రాంతాలపై దాడులు, అక్కడ నిషేదిత బ్యానేర్స్ కట్టినప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా లో సంక్రాంతి పండుగ మొదటి రోజు బోగి రోజు మధ్యాహ్నం నుండి పశ్చిమగోదావరి జిల్లా లో కోడి పందాలు ఉపందు కొన్నాయి. అయితే సాయంత్రానికి ముగించేశారు. వాటితో పాటు గుండాట , కోతాట, ఇలా జూదాల వినోదం, బిర్యానీ, కోడి పకోడీ షాపులు…అదో వాతావరణం.. షరా మాములే.. ముఖ్యంగా భీమవరం పట్టణం శివారులలో గతంతో పోలిస్తే ఈసారి చాల తక్కువ బరులే ఏర్పాటు చేసారు.ఇక భీమవరం పరిసర ప్రాంతాలు పాలకోడేరు, కాళ్ళ , ఉండి, వీరవాసరం లతో పాటు వెంపలో ఎప్పటిలానే పందాలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి దూరప్రాంతాల నుండి వచ్చిన అతిదులతో భీమవరం కోలాహలంగా ఉంది. హోటల్స్ లో , గెస్ట్ హోస్ లలో ఆతిధ్యం అదిరిపోతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఆర్ధికంగా కొంత స్లంప్ ఉండటంతో, దానికి తోడు ఇక్కడ ఆక్వా కొంత దెబ్బ తినడంతో గతం మాదిరి భారీ లక్షల పందాలు జోరు పెద్దగా కానరాలేదు. భీమవరం వెంప లో భారీ డిజిటల్ స్క్రీన్ ఫై భీమవరం బ్రాండ్ ప్రభాస్ కల్కి , సలార్ కి సంబందించిన స్టిల్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలచింది గొల్లల కోడేరు గ్రామంలో జరుగుతున్నా కోడిపందాలు ఆపాలని గ్రామా సర్పంచ్ ఉప సర్పంచ్ లు గ్రామా పంచాయితి వద్ద నిరసన దీక్ష చెయ్యడం మరో విశేషం.. అంతా ప్రశాంతంగా ఉన్నపటికీ తాడేపల్లి గూడెం రోడ్డులోని పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.అని సమాచారం. భీమవరానికి 11 కిమీ దూరంలో కాళ్ళకూరు గ్రామంలో కోడి కత్తి కట్టి పందెం వేస్తున్న సమయంలో కోడి కత్తి తగిలి యువకుడికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువకుడిని మెరుగైన వైద్యం కోసం భీమవరం కు తీసుకొనివచ్చారని సమాచారం…
