సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఇది సంక్రాంతి, కోడిపందాల సీజన్. అందుకే దర్శకుడు మారుతి నేడు, సోమవారం తన కొత్త సినిమా ‘ది రాజా సాబ్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను భీమవరం మండలం వెంపలో సంక్రాంతి వేడుకలలో భాగంగా రిలీజ్ చేశాడు. భారీ ఎల్ ఎల్ ఈడీ డిజిటల్ స్క్రీన్ ఫై ప్రదర్శించారు. భీమవరం బ్రాండ్ ప్రభాస్ అసలు సిసలు తెలుగు యువకుడుగా మాస్ లుంగీ కట్టి రంగంలోకి దిగుతున్న ప్రభాస్ లుక్ ఇది. ఈ మధ్య కాలం లో ప్రభాస్ .బాహుబలి-2, సాహో, రాధేశ్యా మ్, ఆదిపురుష్ సలార్,.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అతడి పాత్రలన్నీ పాన్ ఇండియా సినిమా స్థాయి భారీ పాత్రలే.. సెట్స్ పై ఉన్న కల్కి లో కూడా ప్రభాస్ ది ప్రపంచాన్ని కాపాడే పెద్ద పాత్రే. ఇలాంటి పాత్రల నడుమ కాస్మో లుక్ తో పాటు గ్రామీణం కలగలసిన భీమవరం వెటకారం వంటబట్టిన కుర్రాడు పాత్రతో మన డార్లింగ్ చాల కాలం తరువాత తెలుగు హీరోగా వస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు ‘ది రాజా సాబ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఏకంగా 5గురు హీరోయిన్స్ తో వినోదం కలగలసిన పాత్రలో ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ పాన్ ఇండియా అప్పీల్ కోసం రాజా సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కల్కి రిలీజ్ అయ్యాక ఇదే ఏడాది ప్రేక్షకులను పలకరిస్తాడు రాజా సాబ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *