సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి.వి.రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరం వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు SAE ఇండియా వారు దేశంలోనే మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ నందు ఇండోర్, పీఠంపూర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయస్థాయి హైడ్రోజన్ బాహా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి లక్ష పదివేల రూపాయలు నగదు బహుమతిని సాధించారని ప్రిన్సిపల్ డాక్టర్ మంగం వేణు తెలియజేశారు. SAE ఇండియా వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైడ్రోజన్ బాహా పోటీల్లో దేశం నలుమూలల నుండి జాతీయస్థాయిలో ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ఆల్ టెరైన్ వాహనాలు ప్రదర్శించి వాటి పనితీరును పరీక్షిస్తారని. ఈ పోటీల్లో తమ కళాశాల నందలి మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విభాగం లోని మూడవ సంవత్సరం మరియు నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల టీం అమిగో తయారు చేసిన హైడ్రోజన్ వాహనం ఐదు విభాగాలలో ప్రథమ స్థానంలో నిలచి నగదు పురస్కారాన్ని అందుకున్నదని గర్వంగా తెలియజేశారు హైడ్రోజన్తో నడిచే వాహనాలకు రానున్న రోజుల్లో చాలా ప్రజాదరణ ఉంటుందని ఎందుకనగా పెట్రోలు మరియు డీజిల్ తో నడిచే వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువ మరియు వాటి నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుందని రానున్న రోజుల్లో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఈ సందర్భంగా..విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ K V విష్ణు రాజు , వైస్ చైర్మన్ర, విచంద్రన్ రాజగోపాల్ మరియు సెక్రటరీ K. ఆదిత్య విస్సం కళాశాల డైరెక్టర్ డాక్టర్ దసిక సూర్యనారాయణ ,విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు
