సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగకు వచ్చిన బంధుమిత్రులు, కొత్త అల్లుళ్లతో గత 5 రోజులుగా పల్లెలు, పట్టణాలు కళకళలాడాయి. ముఖ్యముగా భీమవరం పట్టణం నిన్న బుధవారం కనివిని ఎరుగని అతిధుల సందడితో ట్రాఫిక్ జాం లు.. శ్రీ మావుళ్ళమ్మ వార్షిక మహోత్సవాలు ప్రాంతం కళకళ లాడింది. హోటల్స్ ఎగ్జిబిషన్స్ , సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ ఎక్కడ చుసిన సందడే.. నిజానికి ఈ ఏడాది ఆర్ధికంగా స్లంప్ ఉందని సందడి తక్కువ అని భావించారు. కానీ విచిత్రంగా ఎప్పుడు లేని జనసందోహం .. మంచి వ్యాపారం జరిగింది. .. సంక్రాంతి శోభ మరో పది తరాలు సురక్షితం అన్న భరోసా లభించింది. గత సాయంత్రం నుండి నేటి గురువారం బందువులకు వీడ్కోలు జరుగుతుంది. బస్టాండ్స్ రైల్వే స్టేషన్స్ లో కిక్కిరిసిన ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వచ్చిన బంధువులు తిరుగుముఖం పట్టడంతో ప్రతి ఇంటిలో వెళ్లిపోతు న్నారనే బాధతో వీడ్కోలు పలుకుతున్న హృదయాలు బరువెక్కాయి. భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో రద్దీ కనిపించింది. బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఇక ప్రవేటు వాహనాలకు డిమాండ్ మాములుగా లేదు..పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ 31 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అన్ని హౌస్ ఫుల్ .ఇక రెగ్యులర్ రైళ్లతోపాటు భీమవరం మీదుగా నరసాపురం నుంచి వేసిన రెండు ప్రత్యేక రైళ్లు నిండుకున్నాయి. ఇక కాకినాడ నుంచి భీమవరం మీదుగా వెళ్లిన లింగంపల్లి ఎక్స్‌ప్రెస్ నిండుకుంది. శేషాద్రి, సర్కార్, విశాఖ, ఎల్‌టీటీ వంటి ముఖ్య రైళ్ళల్లో వెయిటింగ్ లిస్టులు చాంతాడంత ఉండటంతో స్లీపర్ రిజర్వేషన్ బోగీలలో వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు ఎక్కేయడం జరిగింది. ప్రత్యేక రైళ్లు తక్కువ కావడంతో బెంగళూరు, చెన్నై, వెళ్లే ప్రయాణీకులు పలు రైళ్లు మారాల్సి వచ్చింది.
