సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరి కొద్దీ రోజులల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల జాబితా అభ్యంతరాలను ఈనెల 22 లోపు (వచ్చే మంగళవారం తో )పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి కలెక్టర్లు, డీఈవో లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు అయ్యేంత వరకు అధికారులంతా అప్ర మత్తంగా ఉండాలన్నారు. 2023 అక్టోబరు 28 డ్రాఫ్ట్‌రోల్‌ ప్రకటన తర్వాత వచ్చిన ఫామ్‌–6,7,8 క్లెయిమ్స్‌ అన్నింటిని విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక సదు పాయాలు ఉన్నాయా ?లేదా ?.ఇక్కడ పోటీ చేసే ప్రజా ప్రతినిధుల ఓటుహక్కు ఉందా లేదా? మరి ఏ ప్రాంతంలో ఉంది? తనిఖీ చేయాలన్నారు. గత ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైన ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం ఈసారి పెంచేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *