సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్-మయన్మార్ (బర్మా) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయటంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో పటిష్టమైన కంచెను ఏర్పాటు చేయనున్న ట్లు హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు.ఇటీవల సుమారు 600 మంది మయన్మా ర్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రం లోకి వచ్చా రు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు భారత సరిహద్దులలో మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం ఆ మయన్మార్ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాం ప్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయాన్ని .. మిజోరం సీఎం లాల్దుహోమ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. దానితో సరిహద్దు వద్ద కూడా చాలా పటిష్టమైన కంచె ఏర్పాటు చేస్తామని, దీ తో మనదేశం లోకి సరిహద్దులు దాటుకొని మయన్మా ర్ సైనికులు రావటం సాధ్యం కాదని ప్రకటించారు.
