సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజవర్గ ములో ఇల్లు లేని ప్రజలకు రెండో విడత గా 3 వేల 848 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ మొదటి విడతగా సుమారు 2 వేల టిడ్కో గృహాలను ( 1984 ఇళ్ళు ) లబ్ధిదారులకు అందించడం జరిగిందని, రెండో విడతగా నేడు, 3 వేల 848 టిడ్కోగృహాలను లబ్ధిదారులకు అందిస్తున్నామని ప్రకటించారు. ఈ గృహాలను పేదలకు ఇవ్వడానికి వాటిని పూర్తీ చెయ్యడానికి నేను అధికారులను సినిమాలలో సూర్యకాంతం అత్తయ్య తరహాలో వేధించి పూర్తీ చెయ్యిస్తున్నానని .. ఇందంతా పెదాలకోసమేనని, మీ కోసం నేనున్నాను, కష్టం అంటే ఏమిటో తెలిసిన వాడిని, ప్రజలకు మేలు చేయడమే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ ఆధ్వర్యంలో, ప్రజలకు ఆరోగ్యశ్రీ , పేదలకు ఇళ్లు వంటి సంక్షేమ పధకాలు అమలు అయ్యాయని, ఆయన తనయుడు, మరింత ముందడుగు వేశారన్నారు. 2004 లోనే పేదల కోసం 82 ఎకరాలు తాను ఎమ్మెల్యేగా స్వర్గీయ వై యస్ రాజశేఖరరెడ్డి సహకారంతో సాదించబట్టే ఈ రోజు వాటిలో నిర్మించిన టిడ్కోగృహాలను లబ్ధిదారులకు ఇవ్వగలుగుతున్నామని ప్రకటించారు. తనపై ఎన్నో కుట్రలు జరిగాయని అన్నారు. నా హయాంలో తప్ప గతంలో ఎవరు పేదలకు ఒక సెంటు భూమి ఇవ్వలేదని ప్రజలు గుర్తు ఉంచుకోవాలన్నారు. చంద్రబాబు మాయమాటలు దొంగ హామీలపై ప్రజలు గతం మర్చిపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
