సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో ఏలూరు కు మాత్రమే వందే భారత్‌ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం జిల్లా మీదుగా విశాఖపట్నం – సికింద్రాబాద్‌ మధ్య నడుస్తోంది. అయితే ఆ రైలు తాడేపల్లి గూడెం మీద నుండి విశాఖ పట్నం వెళుతుందే తప్ప అక్కడ స్టాప్ లేదు. అక్కడ హోల్డ్ ఇవ్వాలని ఎంపీ రఘురామ.. రైల్వే శాఖ మంత్రి కి అధికారులకు గతంలో విజ్ఞప్తి చేసారు. అయితే ఇప్పుడు విజయవాడ – చెన్నైల మధ్య నడుస్తున్న వందే భారత్‌ను భీమవరం టౌన్‌ స్టేషన్‌ వరకు పొడిగించాలని రైల్వే అధికారులు ప్రతిపాదిస్తునట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రైలు చెన్నైలో ఉదయం 5.30కి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి ఇక్కడ మధ్యాహ్నం 3.20కి బయలుదేరి రాత్రి పది గంటలకు చెన్నై వెళుతుంది. ఈ రైలు విజయవాడలో మూడు గంటలపాటు ప్లాట్ పామ్ ఫై ఉండిపోతుంది. అంత సేపు అక్కడ ఉండేకంటే.. ఈ ఎక్స్‌ప్రెస్‌ను మరో 100 కిమీ పైగా దూరంలో ఉన్న భీమవరం వరకు పొడిగిస్తే మంచిదని భావిస్తున్నారు. ప్రస్తుతం భీమవరం మీదుగా సుదీర్ఘ కాలంగా ఒక్క సర్కార్‌ ఎక్స్ ప్రెస్ మాత్రమే చెన్నయి వరకు నడుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే మార్చిలోపే వందే భారత్‌ భీమవరం టౌన్ నుండి బయలు దేరుతుంది. ఇటీవల విజయవాడ నుంచి నడుస్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడించారు.ఇది కూడా భీమవరం మీదుగా వెళుతుండటంతో కర్ణాటక వెళ్లే ప్రయాణీకులకు మరో బోనస్ లభించినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *