సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్ సభ ఎన్నికలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక స్పష్టత ఇచ్చారు. నేడు, ఆదివారం చేవెళ్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లోదేశంలో 350వరకు బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తోందని ధీమాతో ఉన్నారు.తెలంగాణాలో అయితే 10 సీట్లు గెలిచి ప్రధాని మోదీకి గిప్ట్‌గా అందజేయాలని అభిప్రాయ పడ్డారు.మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థికశక్తిగా ఎదిగిందని అన్నారు. . జాతీయ రహదారుల విస్తరణ జరిగిందని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.గత సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని రోజుల సమయం ఇద్దామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *