సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఆక్వా రైతులు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని 2కే ర్యా లీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వారికీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. ఆక్వా సాగుకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్తు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన కూడా కొన్ని నిబంధనలు పెట్టి అసలయిన ఆక్వా రైతుకు ఆ సబ్సిడీ అందకుండా చేశారనని అన్నారు. అసెంబ్లీలో చట్ట విరుద్ధంగా బిల్లు ఆమోదింపజేసి ఆక్వా ఫీడ్, హేచరీలను ప్రభుత్వ అజమాయిషీ లోకి తెచుకొన్నారని దీనితో అన్ని ధరలు పెరిగిపోయి … లాభాలు రాక నష్టాలతో ఆక్వా రైతులు బలయ్యారని ఆరోపించారు.త్వరలో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులకు ఎటువంటి నిబంధనలు మెలికలు లేకుండా రాయితీలు అందిస్తామని ఎమ్మె ల్యే నిమ్మల రామానాయుడు వారికీ భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *