సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జై శ్రీరామ్ .. 500 ఏళ్ళు పైగా యావత్ భారతం నిరీక్షణ ఇన్నాళ్లకు నిజం అయ్యింది. నేడు, సోమవారం జరిగిన అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం కు కులమతాలకు అతీతంగా అఖండ భారతావని ప్రజలు జై శ్రీరామ్ అంటూ సంఘీభావం ప్రకటించారు.దేశంలో ప్రతి గ్రామం, ప్రతి నగరం అయోధ్య అయ్యింది. భక్తజన అభీష్ట ప్రదాయకుడైన జగదభిరాముడు రమ్యమోహనంగా వాడవాడలా ప్రత్యేక పూజలతో దీపారాధనలతో ఆధ్యాత్మిక శోభతో అలరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం భీమవరం పట్టణం అంత ఎక్కడ చుసిన కేసరి రంగు జెండాలతో కళకళలాడింది. ఆబాల గోపాలం జై శ్రీరామ్ అంటూ హనుమాన్ వానర సేనను తలపిస్తూ భక్తి పారవశ్యంతో ఓలలాడారు. భీమవరం క్షత్రియ యూత్ , ప్రభాస్ ప్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అడ్డవంతెన వద్ద భారీ స్థాయిలో శ్రీ రామ శిబిరం ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఇంకా పలు చోట్ల అన్నసమారాధనలు, ప్రసాద వితరణలు తో శ్రీ రామభక్త కీర్తనలుతో పట్టణం అంతా శోభాయమానం అయ్యింది. నేటి సాయంత్రం నుండి రాత్రి వరకు బాణాసంచా కాల్పులతో పట్టణంలో ఆకాశం వెలుగులు జిమ్మింది. దేవాలయాల వద్ద ఉచితంగా భక్తులు పాల్గొనేలా దాతలు దీపోత్సవాలు నిర్వహించారు. ఎక్కడ చుసిన శ్రీ సీతారామ లక్షణా హనుమ సమేతంగా శ్రీ రామచంద్రుడు ఇక్కడే కొలువై ఉన్నాడు అన్న అనుభూతి కలుగుతుంది. జై శ్రీరామ్… జై శ్రీరామ్ ..( ఫై చిత్రంలో బాల శ్రీరాముని మూలవిరాట్ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *