సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో తమ డిమాండ్స్ పరిష్కారం కోసం గత నెల రోజులుగా ఆందోళనలు నిరసనలు తెలుపుతూ ఈనెల 24వ తేదీన బంద్ పిలుపు నిచ్చిన అంగన్వాడీ ల తొలగింపునకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం వారికీ ఎదురు షాక్ ఇచ్చింది. వారి స్థానాల్లో భర్తీ చేసేందుకు ఈ నెల 25న నోటిఫికేషన్ ఇచ్చి, 26 నుంచి online ద్వారా దరఖాస్తులు స్వీకరించనుందని ?సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల్లో తొలగింపుల ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. చిన్నారులను వారి, పౌష్ఠిక ఆహారం , ఆరోగ్యం విద్య గురించి పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదని అంగన్వాడీలు ఉద్యమించడం విరమించాలని వచ్చే జూన్లో జీతాల పెంపునకు హామీ ఇచ్చినప్పటికీ అంగన్వాడీలు ఆందోళన విరమించకపోవడంతో జగన్ సర్కార్ సీరియస్ అయ్యింది.అంగన్వాడీ సమ్మెలో పాల్గొన్న వేలాది మంది అంగన్‌వాడీలను, ఆయాలను నేటి సోమవారంలోగా విధులకు హాజరు కావాలని ఆదేశించిన విధులకు హాజరు కానివారిని తొలగిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగిస్తూ.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లాలో 109 మంది వెనకడుగు వేసి విధులకు హాజరయ్యారు. 1485 మంది కార్యకర్తలతో సహా 1343 మంది సహాయకులు విధులకు హాజరవ్వకుండా సమ్మెలో పాల్గొన్నారు. వీళ్లందరినీ జనవరి 22వ తేదీన నేడు, సోమవారం తొలగిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వీరి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించే వరకు.. ఈ-కేంద్రాలకు ప్రత్యామ్నాయ సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు.
