సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వైసిపి ఎన్నికలకు 2నెలలు ముందే పార్టీ అధినేత, సీఎం జగన్ వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ , లోక్ సభ నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక , చేర్పులు మార్పులు ముందే చెప్పేయడం తో అసంతృప్తి తో ఉన్న పలువురు నేతలు పార్టీకి దూరం అయ్యి వారిదారి వారు చూసుకొంటున్న విషయం అందరికి తెలిసిందే. వైసిపి మాత్రం వారికి సర్వే లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చాలాకాలంగా మంత్రి విడుదల రజని తో తీవ్ర విభేదాలు పడుతున్న యువ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు ను బిసి అభ్యర్థిగా గుంటూరు నుండి పోటి చెయ్యాలని పార్టీ ఆదేశించడంతో.. తదుపరి పరిణామాల నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న నరసరావుపేట వైసీపీ యువ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు నేడు, మంగళవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు, నైతిక విలువలు పాటిస్తూ లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని స్పష్టంచేశారు. తదుపరి కార్యాచరణ ఫై మాట్లాడలేదు.అయితే టీడీపీ నేతలు ఆయనతో ఇటీవల తరచూ భేటీ అవుతున్నారు.
