సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లెఫ్ట్ పార్టిల మద్దతుతో టీడీపీ జనసేన పార్టీల సంఘీభావంతో ఈనెల 24 న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు సిద్ధపడ్డ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ సిబ్బంది ఆకస్మికంగా సమ్మె విరమించారు. జగన్ సర్కార్ వచ్చే జులై లో జీతాలు పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో..ఇంకా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సోమవారం (నిన్న) సాయంత్రం లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించింది. లేదంటే ఉద్యోగుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. ఇంకా సమ్మె చేస్తున్న అంగన్వాడీ లకు నోటీసులు ఇచ్చి కృష్ణ జిల్లాలో కొందరిని తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం.. తదుపరి కొత్త అంగన్వాడీ నియామకాలకు నోటిఫికేషన్ కు శరవేగంగా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో గత రాత్రి అంగన్వాడీ లు తమ సమ్మె విరమించినట్లు ప్రకటించారు. నేటి , మంగళవారం నుండి యధావిధిగా తమ విధులు నిర్వర్తిస్తామని ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజుల నుంచి సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు కు సమ్మె కాలం జీతం ఇప్పించాలని, జులై నుండి జీతాలు పెంచడం ఫై ప్రభుత్వాం వ్రాత పూర్వక హామీ ఇస్తే మంచిదని మంత్రి బొత్స కు సంఘ నేతలు విజ్ఞప్తి చేసారు. ఆయన ఆ విషయలు పరిశీలిస్తామన్నారు.
