సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సరైన హిట్ సినిమాలేని పవన్ కళ్యాణ్ కు..ఎన్నికలు సమీపిస్తున్న వేళా జనసేన అధినేత కు ఒక బ్లాక్ బస్టర్ సినిమా పడితే ఆయనకు మరింత బూస్టప్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఐడియా పవన్ కు ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ఉస్మాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు పూర్తిగా ప్రక్కన పెట్టి కేవలం O G సినిమాపైనే పూర్తీ ఫోకస్ పెట్టారు. అయితే పరిస్థితి బట్టి చుస్తే ఈ సినిమా కూడా ఎన్నికలు తరువాతే ఆగస్టులో రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే సినిమా ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తీ అయ్యిందని పవన్ కళ్యాణ్ ఏ మాత్రం వరుసగా 20 రోజులు షూటింగ్ చేస్తే సినిమా పూర్తీ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఓజి సినిమాకు క్రేజ్ బాగా వుంది. సాహూ పేమ్ .. సుజిత్ దర్శకుడు కావడం , పవన్ చేసే యాక్షన్ సినిమా కావడం తో ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ఇప్పటికే 17 కోట్లకు విక్రయిచినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కాస్త మనస్సు పెట్టి షూటింగ్ పూర్తీ చేస్తే సినిమా ఏప్రిల్ నెలలో ఎన్నికల వేళా సందడి చేస్తుందని అభిమానులకు ఆశ ఇంకా మిగిలి ఉంది.
