సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ ప్రజలు వ్యాపారవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా నేపథ్యంలో.. నేడు, గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ 2024-25ను ‘కేవలం గంట లోపు’ సమయంలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 2025 మొత్తం వ్యయం రూ. 47.66 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. రుణేతర ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు ఉండొచ్చని, నికర రుణాలు రూ. 11.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. జీడీపీ (GDP) అంటే గవర్నెన్స్, డవలప్‌మెంట్, పెర్ఫార్మెన్స్ అనే కొత్త అర్థాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, మంత్రి నిర్మల తెలిపారు. దేశంలో పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు లేవని ప్రకటించారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతల స్థితిగతులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.-పన్ను సంస్కరణలతో పన్ను వసూళ్లు పెరిగాయి.అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నాం అన్నారు. ఈ ఏడాది దేశంలో సూర్య రశ్మి ఆధారంగా రూఫ్‌టాప్ సోలారైజేషన్ ద్వారా 1 కోటి ఇళ్లు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూఫ్‌టాప్ సోలారైజేషన్ ద్వారా రూ.15,000 – రూ.18,000 వరకు ఆదా అవుతుందని, మిగులు ఆదాయాన్ని డిస్కమ్‌లకు విక్రయించొచ్చని ఆమె ప్రకటించారు.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లు 2024కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
