సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నేడు, గురువారం మధ్యంతర బడ్జెట్ పెద్దగా మార్పులు లేకుండానే వేశపెట్టిన దరిమిలా.. నేటి ఉదయం నుండి స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మార్కెట్లు ఉదయం మొదట నష్టాలతో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. తర్వాత పుంజుకుని లాభ పడ్డాయి. లాభ, నష్టాల మధ్య షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులను ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు నిశీతంగా పరిశీలిస్తున్నారు. ట్రెండ్ బట్టి సాయంత్రం వరకు షేర్ల అమ్మకాలు ఉంటాయి. మధ్యాహ్నం 12.55 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 27.70 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5.70 పాయింట్లు లాభపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు లాభపడగా.. లార్సన్ అండ్ టూబ్రో, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోతున్నాయి. గత బుధవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాలలో దూసుకొనిపోయిన విషయం తెలిసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *