సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2020కరోనా కు ముందు .. 2022 కరోనా కు తరువాత అన్న రీతిలో దేశంలో పెట్రోల్ మొదలుకొని అన్ని నిత్యావసర వస్తువుల ధరలు శరవేగంగా భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇక బియ్యం ధరలు అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఇక రేషన్ బియ్యం తినలేని సామాన్య మధ్యతరగతి ప్రజలు అయితే సన్న బియ్యం కొనలేని దుస్థితిలో కేజీ బియ్యం 45 రూపాయల నుండి 65 రూపాయల స్థాయికి ఇటీవల ధరలు దూసుకొని పోయిన పట్టించుకొన్న నాధుడు లేదు.. అయితే ఎన్నికలు మరో 3 నెలలలో వచ్చేస్తున్నాయి. మరి సామాన్య ఓటర్ ను ప్రసన్నం చేసుకోకపోతే ఎట్లా? ఇప్పటికే ఉత్తర భారత దేశంలో బియ్యం ధరలకు కళ్లెం వేస్తూ కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్’ అంటూ కేజీ 25 రూపాయల ధరకే బియ్యం అమ్మకాలుతో ప్రయోగాత్మకంగా ప్రత్యేక స్టోర్స్ ప్రారంభించింది. ఇక ఇప్పుడు దక్షిణ భారత దేశంతో సహా అన్ని కీలక ప్రాంతాలలో ధరల నియంత్రణ కోసం, రేపటి శుక్రవారం నుంచే మార్కెట్ లోకి నాణ్యమైన బియ్యం వస్తుంది.. వీటికి భారత్ రైస్ గా కేంద్రం నామకరణం చేసింది. ఈ భారత్ రైస్ ను కిలో కేవలం 29 రూపాయలకే విక్రయించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఇక ఏపీలో అన్ని రేషన్ షాప్ లలో భారత్ రైస్ విక్రయాలు విస్తరిస్తే అందరికి ప్రయోజనం కలుగుతుంది.
