సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎటువంటి బిల్లులు లేకుండాఏకంగా 6 కేజీల 92గ్రాముల బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పది మంది సభ్యులు గూడూరు నుండి రాజమండ్రి బంగారం తరలిస్తున్నారని భీమవరం పోలీసులు కు అజ్ఞాత వ్యక్తి ద్వారా సమాచారం రావడంతో పోలీసులు రైల్వే స్టేషన్లోసమీపంలో నిఘా వేసి వారిని పట్టుకోనట్లు, జిల్లా ఎస్పీ రవి ప్రకాష్( ఈయన బదిలీ కానున్నారు) మీడియాకు తెలిపారు. ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భీమవరంలో గురువారం తెల్లవారు జాము పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సోదాల్లో 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు.బిల్లులు చూపకపోవడంతో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
