సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అధికారికంగా ప్రకటించినప్పటికీ పరమ శివునిగా ప్రభాస్ ప్రత్యేక పాత్రలో మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప ‘ పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమౌతున్న సినిమా దసరా కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా భారీ షెడ్యూలు కోద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్లో అందమైన లొకేషన్స్ లో పూర్తి చేసుకొని చిత్రయూనిట్ భారత్ కు తిరిగొచ్చేసింది. ఇక ఇందులో నటిస్తున్న ప్రభాస్ కూడా అతి త్వరలో కన్నప్ప సెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. కేవలం 7 రోజుల లోపే ఆయన సన్నివేశాలు చిత్రీకరణ పూర్తీ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రత్యక పాత్రలలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. మహాభారత్ టివి సీరియల్ అద్భుతంగా రూపొందించిన ధీరజ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *