సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే దిశలో జనసేన పొత్తుతో టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా పొత్తులో భాగంగా సీట్ల లో అభ్యర్థుల ఎంపికపై హైదరాబాద్ లో తన నివాసంలో సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు మరోసారి ఏపీలో పర్యటించనున్నారు. రేపు ఆదివారం ఉదయం 10.30 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రానున్నారు. ఉదయం 9.15 గంటలకు హెలికాప్టర్‌లో నేరుగా ఉండవల్లి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు.రేపు, మధ్యాహ్నం తర్వాత టీడీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తారు తదుపరి .. ఏపీ లో ఈనెల 5, 6 తేదీల్లో మూడు చోట్ల నిర్వహించే ‘రా.. కదలి రా’ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. 5వ తేదీన అనకాపల్లి పార్లమెంట్ మాడుగుల, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలలో టీడీపీ అధినేత పాల్గొంటారు. 6వ తేదీన చిత్తూరు పార్లమెంట్‌లోని జి.డి. నెల్లూరులో మూడు సభల్లో చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ‘‘రా.. కదలి రా’’ సభలను నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *