సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏర్పాటుచేసిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు మేల్కోవాలని, అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని పిలుపునిచ్చారు.‘ఈసారి ఎన్నికలలో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ అవ్వాలి. జగన్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న వాలంటీర్స్ జగన్ను నమ్ముకుంటే మేము అధికారంలోకి వచ్చాక జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలని వాలంటీర్లను హెచ్చరించారు. . తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కావాలనే వారిలో అభద్రతాభావం సృ ష్టిస్తున్నా రు. వాలం టీర్లు ప్రజలకు సేవ చేస్తే మేం వ్యతిరేకం కాదు. కానీ,వాలంటీర్లకు రాజకీయాలొద్దు. మంచి పనులు చేసేవారికి సహకరిస్తాం . భవిష్యత్ లో అసలు విద్యు త్తు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నా. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. పెరిగిన సంపద పేదలకు చేరాలనేది నా సంకల్పం .తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి అన్నది నా ఆశయం అన్నారు చంద్రబాబు.
