సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హస్తినలో చంద్రబాబు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ని తీసుకొనిరావడానికి బీజేపీ పెద్దలతో చేస్తున్న విశ్వప్రయత్నాలలో సీట్ల వాటా విషయం పవన్ తో మరో మారు చర్చించే అవకాశములు ఉన్న నేపథ్యంలో.. నేడు, వైజాగ్ లో జనసేన పార్టీ నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు, గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అధికార వైసీపీ వారి అభ్యర్థులను ప్రకటిస్తూ ఏడో జాబితా కాదు… లక్ష జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదని, జనసేన ఎన్ని అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు. పొత్తులు సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే…పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను తమ అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. FLASH NEWS: నాగబాబు అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *