సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం వైఎస్సార్సీపీ తన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. కొద్దీ రోజులలో జరుగనున్న ఎన్నికలలో ఏపీ ఎమ్మెల్యేల ఓట్ల కోటా నుండి బరిలో వైవీ సుబ్బా రెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. వీరు ముగ్గురు సీఎం జగన్ కు నేడు కృతఙ్ఞతలు తెలిపారు. వీరి ముగ్గురిని గెలిపించేందుకు కావలసిన ఎమ్మెల్యేల బలం వైసిపి కి ఉంది. ఇక, నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ను స్వీకరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *