సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫి తో ఆయన ప్రస్థానం ‘యాత్ర’ నేపథ్యంలో తెరకెక్కి (2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే..ఆ చిత్రానికి సిక్వెల్ గా మరింత భారీతనంతో తెరకెక్కిన మూవీ యాత్ర 2.లో వై ఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని నేడు, గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. భీమవరంలో విజయలక్ష్మి, మల్టి ఫ్లెక్స్ లలో మంచి ఓపెనింగ్స్ తో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా కధ అందరికి తెల్సిందే, సినిమా ఎలా ఉందంటే మాత్రం.. ఒక్క మాటలో ఆద్యంతం అపూర్వముగా చెక్కాడు దర్శకుడు మహి వి.రాఘవ్. వైఎస్సా ర్ మరణం అనంతరం , జరిగిన రాజకీయ కుట్రలు.. ఆయన తనయుడు, వైఎస్. జగన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి చేసిన ఓదార్పు యాత్ర.. ఆ సమయం లో ఆయనకు ఎదురైన అనుభవాలు.. ఆ పాదయాత్ర కారణం గా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకోవడం.. కాంగ్రెస్ ను ఎదిరించిన కారణంగా 16నెలలు జైలు శిక్ష తదితర కష్టాల ఉదంతాల సమాహారమే ‘యాత్ర 2’ కథ. ప్రత్యర్థులంతా ఒక్క టైనా భయపడకుండా నిలబడి, ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు? ప్రజల కోసం జగన్ కాంగ్రెస్ అదిష్టానాన్ని ఎదిరించిన తీరు పేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు, సోనియా కుట్రలు చేసినట్లు చూపించారు. 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్లేదు కానీ రుణమాఫీ చేస్తానని అబద్దపు హామీ ఇవ్వ లేనని జగన్ పాత్రధారి చెప్పే డైలాగ్స్ ( కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరం కావడం..) , శుభలేఖ సుధాకర్ పలికే ప్రతి డైలాగ్ ఎంతో లోతుగా ప్రేక్షకుల గుండెలలో దూసుకొనిపోతాయి. వైసీపీ అభిమానులకు అయితే తన్మయులవుతారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి వైసిపి కి చెందిన 23 మంది ఎమ్మెల్యే లు పార్టీని వీడినా..జగన్ ధైర్యం తో పార్టీని నడిపించడం ..కృష్ణా బ్రిడ్జిపైకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం. తప్పుడు కేసులు పెట్టిన నందిగాం సురేష్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం ..ఇవ్వన్నీ తెరపై చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇక కొన్ని సన్నివేశాలు ఉన్నపటికీ మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గా తన గంబీరమైన స్వరంతో తెలుగు లో మాట్లాడుతూ అదరగొట్టాడు. ఇక తమిళ హీరో జీవా జగన్ కవళికలు పాత్రను బాగా అర్ధం చేసుకొని నటించారు. ఇక కేతకి నారాయణ్, మహేష్ మంజ్రేకర్ , సోనియా గాంధీని పోలిన పాత్రధారి అందరు తమ పాత్రలకు నాయ్యం చేసారు. సంతోష్ నారాయణ్ పాటలు సంగీతం పెద్ద హైలైట్.. చంద్రబాబు, సోనియా పాత్రల రాజకీయ నైజం చూపించారే తప్ప.. విలన్స్ గా కాదు..కాస్త నెమ్మదిగా సాగుతున్నప్పటికీ మంచి పీల్ ఉన్న మూవీ యాత్ర 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *