సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యువత లో బాగా ప్రబలుతున్న మత్తు పదార్థాల నిర్మూలనతో ఉత్తమ సమాజాన్ని స్థాపించేందుకు, భీమవరం, జమాతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు “రండి ! మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో ఒక రాష్ట్ర స్థాయి అవగాహనా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు జమాతె ఇస్లామీ హింద్ పట్టణ ఉద్యమ కన్వీనర్, మొహమ్మద్ సిద్దీఖ్ నేడు, గురువారం భీమవరం స్థానిక అంకాల ఆర్ట్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలో కూడా మత్తు పదార్థాల సేవనం రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతుందని, పది సంవత్సరాల చిన్న వయసు నుండి 75 సంవత్సరాల వృద్ధ వయస్సు వరకు కోట్ల మంది దీనికి బానిసలుగా మారిపోతున్నారని, ప్రాణాంతక వ్యాధుల బారినపడి లక్షల్లో అర్ధాంతరంగా చనిపోతున్నారని, కుటుంబ సభ్యులకు తీరని లోటును చేకూరుస్తున్నారని తన ఆవేదనను వ్యక్తపరిచారు. దేశంలో సుమారు 7.2 కోట్లకు పైగా (ప్రస్తుతం 13 కోట్లు దాటింది) మరియు మన తెలుగు రాష్ట్రాల్లో 98 లక్షలకు పైగా ఈ మత్తు పదార్థాల బాధితులున్నారని, ఆయన అన్నారు. అందుకే రాష్ట్ర స్థాయిలో ఈ 11 రోజుల అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కరపత్రాలు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం, రౌండ్ టేబుల్ సమావేశాలు, బహిరంగ సభలు, వ్యాసరచన పోటీలు మరియు షాట్ ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్లు ఏర్పాటు చేసి విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని ఇందులో పాల్గొనదలచినవారు సెల్: 9848677137 లేదా 9703124568 నంబర్లపై సంప్రదించవలసినదిగా కోరారు.. ఈ ప్రెస్ మీట్ లో జమాతె ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఫర్హాన్, సభ్యులు ఎం.ఎం. పాషా, ఇంతియాజ్, జానీ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *