సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారు చినమీరం గ్రామంలో 4 దశాబ్దాల క్రితం స్థాపించిన ఇంజనీరింగ్ కళాశాల నేడు, తెలుగు రాష్ట్రాలలో అగ్రస్థాయికాలేజీలలో ఒకటిగా వేలాది ఇంజనీర్లను ప్రపంచాన్ని అందిస్తున్న ఘనత స్వర్గీయ సాగి రామకృష్ణంరాజు నిర్మించిన కళాశాల కే దక్కుతుందని ఎస్ఆర్ కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వీ రంగరాజు పేర్కొన్నారు. నేడు, శుక్రవారం చినఅమీరం లో స్వర్గీయ సాగి రామకృష్ణంరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సాగి రామకృష్ణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భముగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లలో ఒకరిగా అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేతుల మీదుగా మెటల్ కింగ్ అవార్డు అందుకున్న ఆదర్శనీయులు సాగిరాజు రామకృష్ణంరాజు అని తెలిపారు. ఆయన జన్మించిన అమీరం గ్రామ ప్రజలకు సేవలు అందించేందుకు ఆయన పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన వారసులు గ్రామ ప్రజలకు సేవలందించడం స్ఫూర్తిదాయకమన్నారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ చింతలపాటి దిలీప్ చక్రవర్తి కళాశాల సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
