సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో మినీ షిరిడి గా ప్రసిద్ధి పొందిన స్థానిక 24వ వార్డులోని శ్రీఅభయసాయి ధ్యాన మందిరం 31వ వార్షిక మహోత్సవాలలో భాగంగా నేడు, శుక్రవారం వేద పండితులతో రుద్రాభిషేకలు, తులసిదళం, చామంతి పుష్పాలతో విశేషార్చన నిర్వహించారు. ఈ వేడుకలు ఈనెల 8వ తేదీ గురువారం ప్రారంభించినట్లు ఈనెల 11 వరకు వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తామని, 11 తేదీ న బాబావారికి 22 ద్రవ్యాలతో అభిషేకం, అన్నాభిషేకం, నిర్వహించి తదుపరి భక్తులకు అన్నదానం చేస్తామని, భక్తులందరూ పాల్గొనాలని మేనేజింగ్ ట్రస్టీ నిమ్మల శారదా సాయి, కార్యదర్శి అడబాల సాయిరామ కుమార్, కోశాధికారి శివకుమార్ తెలిపారు. విశేషంగా భక్తులు శ్రీ షిరిడి బాబావారిని దర్శించుకున్నారు.
