సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 60వ వార్షిక మహోత్సవాలు ముగింపు గా నేడు, ఉదయం 8 గంటల నుండి (సుమారు 1 లక్ష మంది భక్తులకు} ప్రతి యేటా ఉత్సవాల ముగింపు ఆనవాయితీ ప్రకారం ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాదం కోసం ఎంతో దూరప్రాంతాల నుండి భీమవరం పరిసర గ్రామాల నుండి విశేషంగా భక్తులు హాజరు కావడంతో నేటి మధ్యాహ్నం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భీమవరం వన్ టౌన్ ప్రాంతంలో బస్సు స్టాండ్ నుండి అన్ని ప్రధాన రహదారులు భక్తులతో కిటకిట లడాయి, పలుమారులు వరుస వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. శ్రీ మావుళ్ళమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల నుండి నాలుగు వైపులా .. ఒకొక్క వైపు కిలో మీటర్ చప్పున భారీ క్యూ లైన్లు లో భక్తులు గంటల తరబడి వేచిఉండి ఎంతో భక్తి శ్రద్దలతో శ్రీ అమ్మవారి అన్నసమారాధన లో పాల్గొనడం విశేషం.. సాయంత్రం వరకు అన్న సమారాధన ఉత్సవ కమిటీ వారు శ్రీ అమ్మవారు ఇచ్చిన శక్తితో నిర్వహిస్తున్నారు. నిజానికి నేడు, శుక్రవారం వచ్చిన భక్తుల సంఖ్యా గత 5 ఏళ్లుగా ఎప్పుడు లేనంతగా ఉంది. భక్తులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసారు. స్థానిక పోలీసులు అధికారులతో పాటుపాటు అదనంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పోలీసులు సాధ్యమైనంత వరకు సహనంతో భక్తులు క్యూ లైన్ లా ద్వారా అన్న సమారాధనలో పాల్గొనేలా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎన్ని వేలమంది వచ్చిన సరిపడేలా భక్తులకు చక్కటి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసారు మొత్తానికి భీమవరంలో నేడు, శ్రీ మావుళ్ళమ్మవారి ఆధ్యాత్మిక శోభ ప్రభలం అయ్యింది.
