సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేటి ఉదయం 9గంటల సమయంలో బై పాస్ రోడ్డు బీవీ రాజు విగ్రహం వద్ద టర్నింగ్ లో వేగంగా వచ్చిన లారీ ఒక బైకు ను గుద్దుకొని వేగంగా వెళ్లి పోయిన ఘటనలో బైక్ ఫై పయనిస్తున్న యువతి యువకులు గాయాలతో బయట పడ్డారు. వారి కుటుంబసభ్యులకు వారే సమాచారం అందించారు. వారు రాగానే వారికీ రక్త స్రావం అవ్వుతుండటం తో హాస్పటల్ కు వెళ్లారు. ఈ ప్రమాదంలో బైకు దారుణంగా దెబ్బ తింది . బైకు పరిస్థితి చుసిన ఎవరికైనా ప్రమాద తీవ్రత అర్ధం అవుతుంది. అయితే వారు అదృష్టవశాత్తు బయట పడ్డారనే చెప్పాలి. నిజానికి బివి రాజు విగ్రహం వద్ద ఉండవలసిన ట్రాఫిక్ పోలీసులు అదే సమయంలో ‘డి మార్ట్ వద్ద రైల్వే అండర్ టర్నల్ వద్ద గ్రావెల్ తో వెళుతున్న లోడు లారీ రిపేర్ వచ్చి ఆగిపోవడంతో ట్రాఫిక్ క్రమబద్దీకరించడానికి ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకోవడం గమనార్హం..
