సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య గోదావరి సముద్ర తీరాల సంగమం వద్ద వెలసిన అంతర్వేది లక్షీనృసింహస్వామి దివ్య క్షేత్రంలో నేడు , శుక్రవారం రథ సప్తమి పర్వదినాన లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి 16వ తేదీ నుండి 25వ తేదీవరకు ఈ వేడుకలు నేపథ్యంలో భీమవరం నుండే కాకుండా గోదావరి జిల్లాల నుండి గంట గంటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చెయ్యడంతో వేలాదిగా భక్తులు హాజరు అయ్యారు. లాంచీలలో కూడా ప్రయాణాలు చెయ్యవచు.. నేటి శుక్రవారం ఉదయం నుండి, విశేషార్చనలు పూర్తయ్యాక నేటి సాయంత్రం 4 గంటలకు సూర్య వాహనం పై గ్రామోత్స వం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం పై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. ప్రతి రోజు నగర ఊరేగింపులు ఉంటాయి. అయితే ఈ వేడుకలలో భాగంగా ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 2.05గంటలకు కల్యాణమూర్తులను భారీ రథం పై కొలువుదీర్చి మెరకవీధి నుంచి గుర్రాలక్కమ్మ ఆలయం మీదుగా 16 కాళ్ల మండపం వరకు వేలాది భక్తుల సమక్షంలో జరిగే ఊరేగింపు చూసి తీరవలసిందే. 25వ తేదీ ఆదివారం ఉదయం ప్రత్యేకార్చనలు, పుష్ప యాగం తదుపరి సాయత్రం 5 గంటలకు పుష్పక వాహనం పై స్వామివారి గ్రామోత్సవంతో వేడుకలు ముగుస్తాయి.
