సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పర్యటనలో నేడు, బుధవారం పవన్ కళ్యాణ్ పర్యటనలో అధికారికంగా పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తున్నట్లు తెలిసిపోయింది. ఆయన స్థానికంగా టీడీపీ బీజేపీ కీలక నేతలు గృహాలకు వెళ్లి తన గెలుపుకు సహకరించాలని కోరారు కూడా. ఈనేపథ్యంలో జనసేన క్యాడర్ లో మంచి జోష్ నెలకొంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా మరోసారి పవన్ కళ్యాణ్ తనతో తలపెడితే బాగుంటుందని, కోరుకొంటున్నారు. గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు. ఏది ఏమైనా భీమవరం అంటే భీమవరమే.. అన్ని రంగాలలో భీమవరంకు ఓ స్థాయి ఉంది. అయితే పవన్ కచ్చితంగా భీమవరం నుండే పోటీ చేస్తారని మన సిగ్మా న్యూస్ గత ఏడాది 2023 జూన్ 29వ తేదీన వార్త కధనం ప్రచురించింది. ఆ అంచనా నిజం చేస్తూ ఈ రోజు పవన్ పోటీ ఖాయం అయ్యింది. నిజానికి పవన్ కళ్యాణ్ మొదటి సారి 2019 లో పోటీ చెయ్యడానికి 8 నెలలు ముందుగానే పవన్ భీమవరం నుండే పోటీ చేస్తారని మన సిగ్మా న్యూస్ 2018 లోనే వార్త కధనం ప్రచురించింది . అది కూడా నిజం అయ్యింది. అప్పటి నుండి పనిచేస్తున్న జిల్లా మీడియా మిత్రులకు ఈ విషయంవిదితమే. పవన్ విషయమే కాదు.. నిజం నిష్ఠురమైన ప్రజోపకరమైన ఎన్నో విషయాలను మన సిగ్మా న్యూస్ ఎన్నో సార్లు తాజా తాజగా ముందుగానే తెలియజేస్తుంది. అభినందనలు తెలిపిన మిత్రులకు కృతజ్నతలుతో .
